Sachin Tendulkar: సచిన్ తొలి 'డబుల్' సెంచరీ రికార్డుకు 15 ఏళ్లు 1 y ago
సచిన్ తన సుదీర్ఘ కెరీర్ లో అద్భుతమైన ఆటతీరుతో ఎన్నోరికార్డులు నెలకొల్పాడు. అందులో ఒక రికార్డు మాత్రం ప్రత్యేకమైనది అని చెప్పొచ్చు. అదే వన్డేల్లో డబుల్ సెంచరీ. సాధారణంగా 50 ఓవర్ల ఫార్మాట్లో సెంచరీ చేస్తేనే గొప్పగా భావిస్తారు. అలాంటిది సచిన్ ఏకంగా డబుల్ సెంచరీ బాదేశాడు. అప్పటికి సచిన్ వయసు 36 ఏళ్ల 10 నెలలు. 2010, ఫిబ్రవరి 24.. భారత్, సౌతాఫ్రికా మధ్య గ్వాలియర్ రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్లో సచిన్ (200*, 147 బంతుల్లో 25 ఫోర్లు, 3 సిక్స్ లు) ద్వి శతకం బాదేసి అజేయంగా నిలిచాడు.